Good Health: కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు..

Good Health: కిడ్నీ  సమస్యలతో బాధపడేవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు..

హైటెక్​ యుగంలో  జనాలకు బీపీ.. షుగర్​ కామన్​ .. మధుమేహం కంట్రోల్​ లో లేకపోతే అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది.  శరీరంలో ఎక్కడ బలహీనంగా ఉందో.. ఆప్రాంతంలో ఉండే అవయవాలపై ప్రభావం అంతా ఇంతా ఉండదు.  హార్ట్​ సమస్యలు... కిడ్నీ సమస్యలు  ఇలా ఒకటేమిటి అన్ని వస్తుంటాయి.  అయితే కిడ్నీ సమస్యలున్న వారు  పోషకారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కిడ్నీ సమస్యలున్నవారు ఏమి తినాలి .. ఏమి తినకూడదో తెలుసుకుందాం

కిడ్నీ సమస్యలున్న వారు సరైన ఆహారం తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  అంతే కాదు ఫ్లేవనాయుడ్లు.. యాంటీ యాక్సిడెంట్లు పదార్దాలకు ఆమ ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీపై ఒత్తిడి తగ్గుతుంది.  కొన్ని ఆకుకూరలను అస్సలు తినకూడదు.. మరికొన్ని వాటిని మితంగా తీసుకోవాలి.  

తినాల్సిన పదార్దాలు

  • కిడ్నీ ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహార పదార్థాలు. ఉల్లిపాయ,యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీపై ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి..పొటాషియం తక్కువగా ఉండటంతో ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 
  • కొత్తిమీర, క్యాబేజీ, గోంగూర లాంటి ఆకుకూరలు తక్కువ పొటాషియం కలిగి ఉంటాయి, ఇవి మంచివి. వెల్లుల్లి,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడియం తీసుకోవడం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • క్యాబేజీ,ఫైబర్ ఎక్కువ, పొటాషియం తక్కువగా ఉండటంతో కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • గ్రీన్ గ్రేప్స్ & బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, గ్రీన్ గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. 
  • గోరు మెండు, ఇది నేచురల్ డిటాక్సిఫైయర్, కిడ్నీ పనితీరును మెరుగుపరిచే శక్తి కలిగి ఉంటుంది. వీటిలోసోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది. 
  • చికెన్ & గుడ్లు,ప్రోటీన్ అవసరమైన వారికి తక్కువ సొడియం, ఫాస్ఫరస్ కలిగిన చికెన్ లేదా గుడ్డు తెల్లసొన తినాలి
  • ఫైబర్​ ఎక్కువుగా పదార్దాలను తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ బయటికి పంపడానికి సహాయపడుతుంది.

తినకూడనివి

  •  గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, మెంతి ఆకులు తక్కువగా తినాలి... ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలకు హానికరం. 
  • ప్రోటీన్ ఉన్న పదార్ధాలను ఎక్కువ  తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
  • వైట్ బ్రెడ్, పాలిష్డ్ రైస్ తగ్గించాలి. కొబ్బరి నీరు  పరిమితంగా తాగాలి. డీహైడ్రేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • పొటాషియం అధికంగా ఉన్న పదార్థాలు ..ఆలుగడ్డ, అరటిపండు, టొమాటో, పాలకూర అధికంగా తినకూడదు.
  • భోజనం లో ప్రోటీన్ అధికంగా ఉండకూడదు
  •  సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహారం ...చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి.
  • ఎక్కువ చికెన్, మటన్, చేపలు తినకూడదు.
  • కాఫీ & ఆల్కహాల్ తగ్గించాలి .. ఇవి డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి.