
మాదాపూర్ హైటెక్స్ కేంద్రంగా ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ఇండియా ఎక్స్ పో జరగనున్నాయి. వీటికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం శుక్రవారం హైటెక్స్ ఆఫీస్‌లో నిర్వహించారు. హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కిడ్స్ ఫెయిర్‌లో గేమ్స్, ఆక్టీవిటీస్, రైడ్స్, వర్క్ షాప్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేట్ చేసే గేమ్స్ ఉంటాయన్నారు.
ఫిబ్రవరి 1న పిల్లలకు 4కే, 2కే, 1కే రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 1000 మంది పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారన్నారు. పెట్స్‌కు సంబంధించి దేశ, విదేశాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ