ఐపీఎల్ క్రేజ్ అంటే ఇదీ: పాక్ లీగ్ వదిలేసి ఇండియాకు వచ్చిన పొలార్డ్

ఐపీఎల్ క్రేజ్ అంటే ఇదీ: పాక్ లీగ్ వదిలేసి ఇండియాకు వచ్చిన పొలార్డ్

జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కనిపించాడు. PSL 2024లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్..ఈ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు టోర్నమెంట్‌ను మధ్యలోనే వదిలేశాడు. పాక్ సూపర్ లీగ్ టోర్నమెంట్‌ను మధ్యలోనే వదిలేయాలని వెటరన్ ఆల్ రౌండర్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మార్చి 3 (ఆదివారం) ముల్తాన్ సుల్తాన్స్‌తో కరాచీ కింగ్స్ తన తదుపరి మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ సమయానికి పొలార్డ్ జట్టులో చేరనున్నాడని సమాచారం. 

ముకేశ్ అంబానీ ఫ్రాంచైజీగా ఉంటున్న ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు, పొలార్డ్ తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నాడు.ముంబై జట్టు తరపున పొలార్డ్ 15 సంవత్సరాల పాటు ఆటగాడిగా, కోచ్ గా తన సేవలను అందించాడు. పొలార్డ్ సౌతాఫ్రికా 20, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) ఫ్రాంచైజీ జట్ల తరపున ఆడుతున్నాడు. జామ్‌నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టిమ్ డేవిడ్, ట్రెంట్ బౌల్ట్ , డ్వేన్ బ్రావో , రషీద్ ఖాన్, సామ్ కర్రాన్, నికోలస్ పూరన్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు భారతీయులలో సచిన్ టెండూల్కర్ , ఎంఎస్ ధోని , జహీర్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాజరయ్యారు.

మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానించబడిన అతిథుల కోసం విస్తృతమైన మెనూ ప్లాన్ చేయబడింది. ఈవెంట్‌ల కోసం 25 మందికి పైగా చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందం ఇండోర్ నుండి జామ్‌నగర్‌కు వెళ్లనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.