వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్ 2024కి ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పొలార్డ్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో చేరాడు. 37 ఏళ్ల పొలార్డ్ బార్బడోస్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ ప్రాక్టీస్ సెషన్ లో కనిపించి సలహాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ కోచ్ గా మాథ్యూ మోట్ ఉన్నాడు. అతనికి సలహా దారులుగా మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్లు పాల్ కాలింగ్‌వుడ్,మార్కస్ ట్రెస్కోథిక్, కీరన్ పొలార్డ్ లను నియమించుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్రస్తుత ప్రపంచ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ కప్ కోసం మాస్టర్ ప్లాన్ వేసి వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ ను ఇంగ్లండ్ కన్సల్టెంట్ కోచ్‌గా తీసుకుంది. T20 చరిత్రలో పోలార్డ్ అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో మొత్తం 637 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్ ఇంగ్లాండ్ జట్టుకు సలహాదారుడిగా ఉంటే వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం గ్యారంటీ అంటున్నారు.
36 ఏళ్ళ ఈ ఆజానుబాహుడు గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. 2012 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఈ విధ్వంసకర వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ లో ముంబై తరపున ఆడిన పొలార్డ్.. పలుమార్లు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం MI న్యూయార్క్, MI ఎమిరేట్స్ జట్ల తరపున ఆడుతున్న ఈ విండీస్ వీరుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా పని చేస్తున్నాడు.
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు
4 జూన్: v స్కాట్లాండ్, బార్బడోస్
8 జూన్: v ఆస్ట్రేలియా, బార్బడోస్
13 జూన్: v ఒమన్, ఆంటిగ్వా
15 జూన్: v నమీబియా, ఆంటిగ్వా