
అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్‌లోని అతి పురాతనమైన, అత్యంత క్రియాశీల కిలోవెయ అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ఎగిసిపడింది. హవాయి బిగ్ ఐలాండ్‌లో ఉన్న కిలోవెయా అగ్నిపర్వతం 1983 నుంచి క్రియాశీలంగా ఉంది. అప్పుడప్పుడు ఇందులో స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి. దీంతోపాటు ప్రపంచంలోనే అత్యంత పెద్ద అగ్నిపర్వతమైన మౌనాలోవా కూడా ఇందులో భాగమే.