
టాంజానియా ఇంటర్నెట్ సంచలనం కిలీ పాల్, నీమా పాల్ సోషల్ మీడియాలో అద్భుతమైన డ్యాన్స్‌తో దూసుకుపోతున్నారు. హిందీ పాటలకు తమదైన స్టెప్స్ తో ఆకట్టుకుంటారు. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.
కిలీ పాల్ భారతదేశంపై ప్రేమను వ్యక్తం చేస్తూ మరో వీడియోతో వచ్చాడు. ఈ రీల్‌లో లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే పాట 'శరరా షరారా'ను ఇమిటేట్ చేశారు. ఈ వీడియోలో కిల్ పాల్ తో పాటు..అతని సోదరి నీమా పాల్ కూడా ఉన్నది.
Also Read :- మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు
తన సాంప్రదాయ దుస్తులను ధరించిన కిల్ పాల్..ఈ పాటలో అద్భుతమైన డ్యాన్సును ప్రదర్శించాడు. సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయగా..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకు 60వేలకు పైగా లైక్ చేశారు. 6 లక్షల మందికిపైగా వీక్షించారు.