ప్రేమ పెండ్లి : ఆపబోతే కొట్టి చంపిన్రు

ప్రేమ పెండ్లి : ఆపబోతే కొట్టి చంపిన్రు

మహబూబాబాద్, వెలుగు: ప్రేమ పెండ్లి చేసుకున్న ఇద్దరి కుటుంబాల మధ్య గొడవను అడ్డుకోబోయిన వ్యక్తి  మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో బుధవారం జరిగింది. గంధంపల్లికి చెందిన ప్రశాంత్, లావణ్య ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే విషయంలో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అదుపుచేసేందుకు వెళ్లిన వారి బంధువు మాతంగి రమణయ్య(38)ను ఇటుకతో తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రమణయ్య చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

కరెంట్ షాక్​తో తండ్రీకొడుకులు మృతి

పోయినేడు కంటే ఈసారి మస్తు వడ్లు

న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు?