Killer Artist Review: క్రైమ్ థ్రిల్లర్ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ రివ్యూ.. హత్యలు చేయడం ఓ కళగా భావిస్తే..

Killer Artist Review: క్రైమ్ థ్రిల్లర్ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ రివ్యూ.. హత్యలు చేయడం ఓ కళగా భావిస్తే..

రతన్ రిషి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ (Killer Artiste).ఈ మూవీలో సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సోనియా ఆకుల హీరో హీరోయిన్స్‌‌గా నటించారు. శుక్రవారం (2025 మార్చి 21న) ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జేమ్స్‌ వాట్‌ కొమ్ము నిర్మించాడు. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేసింది. సొసైటీలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘కిల్లర్ ఆర్టిస్ట్’.. ఎలాంటి సస్పెన్స్‌ క్రియేట్ చేసిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

విక్కీ (సంతోష్ కల్వచెర్ల) తన చెల్లెలు స్వాతి (స్నేహ మాధురి) ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. అలా వీరు సంతోషంగా ఉన్న సమయంలో స్వాతి అనుమానాస్పదంగా హత్యకు గురవుతుంది. తనని హింసించి చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. చెల్లెలు మరణం అతనికి ఎంతో దుఃఖాన్నీ ఇస్తుంది. దాంతో విక్కీ మరింత కుంగిపోతాడు.

ఈ క్రమంలో విక్కీ ప్రియురాలు జాను (క్రిషేక్ పటేల్) అతన్నీ మళ్లీ సాధారణ వ్యక్తిలా మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అయినా, తన చెల్లి మరణానికి గల కారణాలు ఏంటని అనుక్షణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. దాంతో బాధ్యతాయుతమైన సోదరుడిగా, స్వాతి మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు బయలుదేరుతాడు.

అదే సమయంలో ఒక హీరోయిన్‌ మాస్క్‌ ధరించిన 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను రేప్లు చేస్తూ చంపేస్తుంటాడు. మోస్ట్ వాంటెడ్ సైకో కిల్లర్గా తన పేరు మార్మోగుతుంది. ఇక అతన్ని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి, టీవీల్లో ప్రసారం చేస్తారు. ఒక ప్యాట్రన్లో మర్డర్ చేసే 'పిచ్చి రవి' వేసుకున్న ఆ మాస్క్‌, విక్కీ ఇంట్లో కనిపిస్తుంది. ఇక తన చెల్లెల్ని చంపింది అతనే అని విక్కీ డిసైడ్ అవుతాడు.

కానీ, కొన్ని సంఘటనల ద్వారా తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని తెలుసుకుంటాడు. మరి విక్కీ చెల్లని చంపింది ఎవరు? ఆ రహస్యాన్ని విక్కీ ఎలా ఛేదిస్తాడు? ఆ సైకో కిల్లర్ పిచ్చి రవి వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ‘కిల్లర్ ఆర్టిస్ట్’మూవీ థియేటర్లో చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. మన సొసైటీలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఎవరూ ఊహించని విధంగా మర్డర్ మిస్టరీని చూపించి డైరెక్టర్ రతన్ రిషి సక్సెస్ అయ్యాడు. తనదైన కోణంలో కథను రాసుకుని, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఫీల్ ఇచ్చేలా చేశాడు. 

చెల్లి దూరమైతే అన్న పడే వేదనని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ప్రేక్షకులకు భావోద్వేగాన్ని ఇస్తాయి. అంతేకాకుండా, సైకో కిల్లర్ పాత్రలో వచ్చే సీన్స్, ముఖ్యంగా ఎందుకు ఆర్టిస్ట్ ముఖంతో మర్డర్స్ చేస్తున్నాడో చెప్పే మోటివ్ ఆసక్తిగా ఉంది.

సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపిస్తూనే, థ్రిల్లర్ ఆడియన్స్ కి కావాల్సిన సస్పెన్స్ క్రియేట్ చేసి దర్శకుడు రతన్ మెప్పించాడు. క్లైమాక్స్‌లో విలన్ ఇతనే అని సర్ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్‌తో ముగించిన విధానం బాగుంది. ఇప్పటికీ ఎన్నో సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఈ సరికొత్త కిల్లర్ ఆర్టిస్ట్, థ్రిల్లర్ మూవీస్ సక్సెస్ పరంపరలో చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు.