మా రాజధానిపై మీ డ్రోన్లు కనిపిస్తే అంతు చూస్తం.. సౌత్ కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి వార్నింగ్

మా రాజధానిపై మీ డ్రోన్లు కనిపిస్తే అంతు చూస్తం.. సౌత్ కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి వార్నింగ్

సియోల్: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ సిటీపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా కరపత్రాలను జారవిడిచే డ్రోన్లు తమ భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ‘‘ఊహించని విపత్తు’’ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్టోబర్ 3న, గత బుధ, గురువారాల్లో ప్యాంగ్యాంగ్ గగనతలంలోకి ప్రచార కరపత్రాలను మోసుకెళ్లే డ్రోన్‌‌‌‌‌‌‌‌లను దక్షిణకొరియా పంపిందని ఉత్తర కొరియా శుక్రవారం ప్రకటించింది.

ఈ ప్రకటనను దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ ఖండించారు. ఉత్తర కొరియా ఆరోపణలు నిజమో కాదో నిర్ధారిం చలేమని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.దీంతో కిమ్ సోదరి యో జోంగ్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆరోపణలను ధృవీకరించడానికి దక్షిణ కొరియా నిరాకరిం చడం.. డ్రోన్‌‌‌‌‌‌‌‌లను మీ మిలిటరీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ స్టర్లు పంపారని స్పష్టం చేస్తున్నది. మీ డ్రోన్ మేం కనుక్కున్న క్షణం భయంకరమైన విపత్తుకు దారి తీస్తుంది” అని ఆమె హెచ్చరించారు