అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా.. ఎందుకంటే..

యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబెర్లీ తన మంగళవారం (జూలై23, 2024) పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై దాడికి బాధత్య వహిస్తూ కింబెర్లీ రాజీనామా చేశారు. జూలై 13 న పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార ర్యాలీ పాల్గొనగా 22 యేళ్ల షూటర్ కాల్పుడు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చెవికి స్వల్ప గాయాలయ్యాయి..ట్రంప్ పై దాడితో అమెరికాలో భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తాయి.    

బట్లర్ టౌన్ షిప్ లో జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన విచారణ సందర్భంగా సోమవారం కింబర్లీ చీటిల్ ను హౌజ్ కమిటీ సభ్యులు మందలించారు. డొనాల్డ్ ట్రంప్ చివరి క్షణంలో తల కదపడంతో తూటా అతని చెవిలోంచి వెళ్లడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్ తల కదిలించకపోతే బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి మరణానికి దారి తీసే అవకాశం ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై మూడు రౌండ్ల కాల్పులు జరిగిపిన వ్యక్తిని స్నిపర్లు అక్కడికక్కడే కాల్చి చంపారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలను పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. అటువంటి క్లిష్ట సమయంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం ఆందోళనకరం.. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే దాడి జరిగింది. అధ్యక్ష అభ్యర్థిపై మరో దాడికి ప్రయత్నించవచ్చనే ఆందోళనలు అమెరికా ప్రజల్లో కనిపిస్తున్నాయి.