సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు . శ్రీతేజ్ పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అతడికి అడపాదడపా జ్వరం వస్తుందని చెప్పారు డాక్టర్లు.
శ్రీ తేజ్ 11 రోజులుగా శ్రీ తేజ్ కిమ్స్ దవాఖానాలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరో వైపు ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులవుతున్నా కండ్లు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన చెందుతున్నారు.
డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ (35) చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ కు గాయాలైన సంగతి తెలిసిందే.
ఈ తొక్కిసలాట కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. చనిపోయిన మహిళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించాడు.