కైనటిక్ గ్రీన్ ఈ-లూనా విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110km

కైనటిక్ గ్రీన్ ఈ-లూనా విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110km

చాలా కాలం తర్వాత ఆటోమొబైల్ రంగంలో తిరిగి అడుగుపెట్టిన కైనటిక్ సంస్థ.. ఇండియాలో కైనటిక్ గ్రీన్ ఈ- ఎలక్ట్రిక్ మోపెడ్ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఈ-లూనా X1 ధర రూ.69,990(ఎక్స్ షోరూమ్).. రెండో వేరియంట్ ఈ-లూనా X2 దీని ధర రూ. 74,990 (ఎక్స్ షోరూమ్ ). ఈ రెండు వేరియంట్లు మల్బరీ రెడ్, ఓసియన్ బ్లూ, పియరల్స్ ఎల్లో, స్పార్కింగ్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్ వంటి ఐదు కలర్లు అందుబాటులో ఉన్నాయి.

E-Lune X1 వేరియంట్ లో 1.7 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఇది 4 గంటల ఛార్జింగ్ సమయంతో ఒకే ఛార్జ్ ఫై 80km  వరకు పరిధిని అందిస్తుంది. E-Luna X2 వేరియంట్ 2kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 110 km ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 1.2 kW ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. దీని వేగం  గరిష్టంగా 50Kmph. 
 
 ఫీచర్ల పరంగా చూస్తే.. E-Luna  డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తుంది. ఇది స్పీడో మీటర్, ఓడోమీటర్, బ్యాటరీ రేంజ్, ఇతర ప్రాథమిక టెల్ టేల్ లైట్లను చూపిస్తుంది. ఇది USB ఛార్జింగ్ పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. వేరు చేసేందుకు వీలుగా ఉన్న ఒక సీటును మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రిక్ మోపెడ్ దాని హెడ్ లైట్ టేల్ లైట్, ఇండికేటర్ లకోసం బల్బ్ లైటింగ్ సెటప్ ను ఉపయోగిస్తుంది. అదనపు ఫీచర్లలో సైడ్ స్టాండ్ సెన్సార్, స్టాండర్డ్ లెగ్ గార్డ్ , 150 కిలోల వరకు లోడ్ మోసే సామర్థ్యం ఉన్నాయి. 

కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్స్, డ్రమ్ బ్రేకులు, ముందు వెనక 16 అంగుళాల స్పోక్డ్ వీల్స్, 170 ఎమ్ ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, 96 కిలోల బరువు తో వస్తోంది. 

Kinetic Green E -Luna  ను ఆన్ లైన్ లో Flipkart  ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది TVS XL 100, ఒకినోవా డ్యూయల్ 100 తో పోటీ పడుతుంది.