
బంకురాను సుహ్మోభూమి అని అంటారు. క్రీ.శ ఆరో శతాబ్దం తరువాత లార్హ్ లేదా రార్హ్ అనే పదం పరిచయం చేశారు. అంటే ఎర్ర మట్టి నేల అని అర్ధం. అదంతా ఎర్రమట్టి ప్రాంతం కావడంతో దానికి ఆ పేరు వచ్చింది. మరి బంకురా అనే పేరు ఎలా వచ్చిందంటే... మల్లా రాజవంశానికి చెందిన 49వ రాజు బీర్ హంబీర్. ఆయనకు ఇద్దరు కొడుకులు. వాళ్లలో ఒకరి పేరు బీర్ బంకురా. రాజైన బీర్ హంబీర్ రాజ్యాన్ని 22 సర్కిల్స్‌గా విభజించాడు. వాటిలో ఇద్దరు కొడుకులకు చెరొకటి ఇచ్చాడు. జైబెలియా అనే సర్కిల్ బీర్ బంకురా చేతికి వచ్చింది. దాన్ని టౌన్‌గా అభివృద్ధి చేశాడు బీర్ బంకురా. అందుకే అతని పేరు మీదుగా ‘బంకురా’ అనే పేరొచ్చింది ఈ ప్రాంతానికి.
టెర్రకోట టెంపుల్స్
ఈస్ట్ జోన్లో బిష్నుపూర్ అనే టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. దానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలో టెర్రకోట టెంపుల్స్, బలుచరి శారీస్‌కి ఫేమస్. అంతేకాకుండా క్లాసికల్ మ్యూజిక్ దల్మదాల్, పెయింటింగ్లకి కూడా పాపులర్. ఇక్కడ దాదాపు16 దేవాలయాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు మల్లరాజ కట్టించినవే. జోర్ మందిర్, రస్మంచ, రాధామధాబ్, కాలాచంద్, మదన్ మోహన్, రాధా గోవింద, శ్యామ్ రాయ్, సింఘ బహాని దేవి, మయెరెపుకుర్ టెంపుల్స్ చూడొచ్చు ఇక్కడికి వెళ్తే. వీటన్నింటితోపాటు జోయ్రాంబతి అనే పవిత్రమైన ప్రదేశం కూడా ఉంది.
బిహారినాథ్ కొండ
ఇక్కడ సుసునియా హిల్స్ అనే టూరిస్ట్ స్పాట్ ఉంది. ఇది బంకురా నుంచి 21 కిలో మీటర్ల దూరంలో ఉంది. బంకురాలోనే అది ఎత్తయిన శిఖరం బిహారినాథ్ హిల్. ఇది బంకురా జిల్లాకు నార్త్‌వెస్ట్రన్ ప్రాంతం చివర్లో ఉంటుంది. బంకురా నుంచి బిహారినాథ్ హిల్ 57 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒకానొక పురాతన జైనమత కేంద్రం. ఈ ప్రదేశం నేచురల్ ఎన్విరాన్మెంట్కి ప్రసిద్ధి. బిహారినాథ్లో కొండలు, చిన్న అడవులు, నీటి చెలమలు, దామోదర్ నది, శివాలయం వంటివి కూడా ఉన్నాయి.
రెండో అతిపెద్ద డ్యామ్
ముకుత్మనిపుర్ అనేది బంకురాలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇది బంకురా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 55 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మనదేశంలోనే రెండో అతిపెద్ద ఈస్టర్న్ డ్యామ్. దీని పొడవు11 కిలో మీటర్లు. ఈ డ్యామ్‌ని1950లో కంగ్స్‌బతి, కుమారి నదుల మధ్య కట్టారు. నీళ్లు నీలం రంగులో ఉంటాయి. చిన్న చిన్న కొండల మధ్యలో ముకుత్ కిరీటంలా మెరిసిపోతుంటుంది. దీని ఆకారం అచ్చం ఆడవాళ్లు అలంకరించుకునే నెక్లెస్‌లా ఉంటుంది.ఝిలిమిలి అనే నేచురల్ ఫారెస్ట్ కూడా ఈ సౌత్ జోన్లోనే ఉంది. ఇది బంకురా నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న అతి సుందరమైన ప్రదేశం. ఝిలిమిలి అంటే బెంగాలీలో ‘కాంతి లేదా మెరుపు’ అని అర్థం. అక్కడి మట్టి మెరుస్తుండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.
సారో ఆఫ్ బెంగాల్
దామోదర్ నదికి దగ్గర్లో దుర్గాపూర్ బ్యారేజ్ ఉంది. దామోదర్ నదిని ‘సారో ఆఫ్ బెంగాల్’ అని పిలుస్తారు. నదికి ఆ పేరు ఎందుకు అనే అనుమానం వచ్చిందా? అందుకు కారణం లేకపోలేదు. వెస్ట్ బెంగాల్లో వరదలు ఎక్కువ. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి దాన్ని అలా పిలుస్తారు. దాంతోపాటు గంగ్దువా డ్యామ్, కోరో పహడ్ వంటివి కూడా చూడదగ్గ ప్రదేశాలే. బంకురా వెళ్లేందుకు బెస్ట్ టైం అక్టోబర్ నుంచి నుంచి మార్చి నెల వరకు.అద్భుతమైన టెర్రకోట కట్టడాలు.. మనసును పులకింపజేసే నదీతీర అందాలు.. శిఖరాల సోయగాలు.. భక్తి పారవశ్యంతో నిండిన దేవాలయాలు.. వీటన్నింటినీ ఒకే చోట చూడాలంటే బంకురా వెళ్లాల్సిందే. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా సిటీలో వీటితోపాటు మరెన్నో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి.