IND vs AUS: కింగ్ చచ్చిపోయాడు.. కోహ్లీ ఔటవ్వడంపై ఆసీస్ మాజీ జుగుప్సాకర వ్యాఖ్యలు

IND vs AUS: కింగ్ చచ్చిపోయాడు.. కోహ్లీ ఔటవ్వడంపై ఆసీస్ మాజీ జుగుప్సాకర వ్యాఖ్యలు

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం విదితమే. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 340 పరుగుల ఛేదనలో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది. 184 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటైన సందర్భంలో ఆసీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ కటిచ్ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. కింగ్ చచ్చిపోయాడని వ్యాఖ్యానించారు.

భారత ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో స్టార్క్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ బంతిని కోహ్లీ వేటాడి మరీ ఔటయ్యాడు. నిజానికి ఆ బంతితో ఒరిగిందేమీ  లేదు. ఆడకుండా వదిలేసిన బాగుండేది. కింగ్ కదా..! ఆడకుండా వదిలేస్తే బాగుండదు అన్నట్లు కవర్ డ్రైవ్ ఆడి స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సైమన్ కటిచ్ 'కింగ్ ఈజ్ డెడ్(King is dead)' అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఆశ్చర్యపోయిన అనుష్క శర్మ

రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఔటయ్యాక అతని భార్య అనుష్క శర్మ సైతం స్టన్ అయ్యింది. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటవ్వగానే.. నమ్మలేకున్నా అనేలా బాధగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ | WTC Final: ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్.. టీమిండియా డబ్ల్యుటీసీ ఫైనల్‌ చేరేనా..?