కింగ్ నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నాసామి రంగ(Naa Saamiranga) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్.. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekar kammula) తెరకెక్కిస్తున్న కుబేర(Kubera) సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది ఈ మూవీ.
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ సినిమాకు ఒకే చెప్పారట నాగార్జున. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో. అవును.. రజిని ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష కనగరాజ్(Lokesh Kanagaraj) తో ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూలీ(Coolie) సినిమా మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. రజినీకాంత్ మాస్ అండ్ స్టైలీష్ లుక్ లో కనిపించిన ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టింది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.
అయితే.. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన రోల్ కోసం నాగార్జునను ఒకే చేశారట మేకర్స్. ప్రత్యక పాత్ర అయినప్పటికీ నాగార్జునకి ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా.. త్వరలోనే ఈ విషయం అధికారిక ప్రకటన రానుంది. ఇలా ఒకేసారి మామ అల్లుళ్ళ(రజినీకాంత్, ధనుష్) సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు నాగార్జున. మరి చాలా కాలం తరువాత స్పెషల్ రోల్స్ చేస్తున్న నాగార్జునకి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.