కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాని తెరకెక్కిస్తున్నారు.సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ‘కుబేర’ నుంచి కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ వీడియోలో నాగార్జున పాత్ర పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చీకటి కమ్మిన వానలో ఓ కంటైనర్ నిండ నోట్ల కట్టలు..చేతిలో గొడుగు పట్టుకుని పడిపోయిన నోటుని చూస్తూన్న నాగ్ కళ్ళలో ఏదో ఇంటెన్స్ కనిపిస్తుంది.
అలాగే తన జేబులోంచి నోటుని తీసి..ఆ పక్కనే పెట్టి వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. అయితే, ఈ సినిమాలో నాగ్ ఆపర కుబేరుడిగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు వీడియో చూస్తే అర్ధమవుతుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ధనుష్ టైటిల్ పోస్టర్ కూడా భిన్నమైన లుక్‌లో ఆకట్టుకుంది.
చిరిగిన బట్టలు..మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ధనుష్ ఆసక్తికరంగా కనిపించారు. ఇక ధనుష్ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. దీంతో ఈ సినిమాలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.