"బ్రహ్మాస్త్ర"లోని కింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రలోని రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ల లుక్ లు విడుదలై.. అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర నిర్వాహకులు. ఈ లుక్ లో కోపంతో రగులుతూ.. చేతి పిడికిలిని ముందుకు చూపుతూ.. రక్తంతో నిండిన ముఖంతో ఉన్న పిక్ ఈ మూవీపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మూడు పార్టులలో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. శివ అనే పేరుతో పార్ట్ 1గా రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్ బీర్ త్రిశూలం పట్టుకొని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇటీవలే అమితాబ్ గురు క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. చేతిలో కత్తి పట్టుకొని ఉన్న ఫొటోను విడుదల చేశారు. ఇప్పుడు కింగ్ నాగార్జునకు చెందిన పిక్ ను పోస్ట్ చేయడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను జూన్ 15న విడుదల కానుండగా.. "బ్రహ్మాస్త్ర" చిత్రాన్ని మాత్రం సెప్టెంబర్ 9 న రిలీజ్ చేయనున్నట్టు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Image