
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. చిత్రీకరణ తుది దశకు చేరడంతో మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ వేగం పెంచారు మేకర్స్. మంగళవారం క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను విజయ్ పూర్తి చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్, గౌతమ్ కలిసున్న ఫొటోను రిలీజ్ చేసిన చిత్ర నిర్మాణ సంస్థ ‘మే 30న బిగ్ స్ర్కిన్స్‌పై ఫీస్ట్ అందించడానికి వీరిద్దరు సిద్ధంగా ఉన్నారు’ అని పోస్ట్ చేసింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ గెటప్, టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని పెంచగా, ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చిన టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.