
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి క్రేజీ కాంబినేషన్ లో వస్తన్న సినిమా "కింగ్‌డమ్". ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ గ్లిమ్ప్స్ రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ కి ముందే కింగ్‌డమ్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది..
అయితే ఇటీవలే మేకర్స్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సౌండ్ ట్రాక్ తో క్రియేట్ చేసిన వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మొత్తం గోల్డ్ కలర్ తో విజువల్స్ ఉన్నాయి. ముఖ్యంగా బంగారపు కత్తి, షీల్డ్, మంటల్లో కాలుతున్న విజువల్స్ ఇలా అన్ని కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఈ విజువల్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ చేసిన బీజియం సూపర్ గ సెట్ అవడంతోపాటూ గూస్ బంప్స్ తెప్పించింది.. కింగ్‌డమ్ తన సౌండ్‌ట్రాక్ కోసం పూర్తిగా AI-రూపొందించిన నేపథ్య వీడియోను ఆవిష్కరించిన మొదటి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సౌండ్ ట్రాక్ టీజర్ అన్ని భాషల్లోనూ 10 మిలియన్ల వ్యూస్ ని అందుకుంది.
ALSO READ | MS DHONI: ధోనీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్.. సందీప్ రెడ్డి సినిమాలో ఎమ్మెస్ ధోనీ..
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కింగ్‌డమ్ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి గతంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఒక్కసారిగా హైప్ పెంచేసాయి. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 30న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.