కేఎఫ్ బీర్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి.. మద్యం ప్రియులకు పండగే

కేఎఫ్ బీర్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి.. మద్యం ప్రియులకు పండగే

తెలంగాణాలో కేఎఫ్ బీర్లు ఉండబోవన్న వార్తలతో మద్యం ప్రియులు  ఎంత ఆందోళన చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి, బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ కి మధ్య ధరల విషయంలో అవగాహన కుదరకపోవడంతో ఇకపై తెలంగాణాలో కేఎఫ్ బీర్ల సప్లై నిలిచిపోనుందని వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణాలో కేఎఫ్ బీర్ల సరఫరా నిలిచిపోలేదని తెలుస్తోంది.. తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం ( జనవరి 20, 2025 ) యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ALSO READ | స్విగ్గిలో అవకాడో సలాడ్ ఆర్డర్ చేస్తే నత్త ప్రత్యక్షం... బిత్తరపోయిన మహిళ..

తెలంగాణ ప్రభుత్వంతో కీలక చర్చల తర్వాత కేఎఫ్ బీర్ల సరఫరాను మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది యునైటెడ్ బ్రూవరీస్. అయితే.. ప్రస్తుతం ఉన్న ధరలకే సప్లై చేస్తారా లేక ధరలు పెంచుతారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ధరల విషయంపై త్వరలోనే సమాచారం ఇస్తామని తెలిపింది సంస్థ.

కేఎఫ్ బీర్లు మళ్ళీ వస్తున్నాయన్న వార్తతో తెలంగాణాలో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తమ ఫెవరెట్ బీర్ కనిపించదన్న ఆందోళనలో కేఎఫ్ బ్రాండ్ ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి వార్త అని చెప్పాలి.