నెలాఖరు వరకే KF బీర్లు.. ఆ తర్వాత మందుప్రియులకు దబిడి దిబిడే

తెలంగాణ మందు ప్రియులకు షాక్.. లిక్కర్ ట్యాక్స్ పేయర్స్.. బీరు బాబులు ఎంతో ఇష్టంగా తాగే కింగ్ ఫిషర్ బీర్లకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టాక్.. ఇప్పటికే అమ్మకాల డేటా ఆధారంగా.. కేవలం 10 రోజులు మాత్రమే వస్తాయంట.. అంటే జనవరి 31వ తేదీ నాటికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ మొత్తం అయిపోయింది. ఈ లెక్కన 2025, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి KF బీర్లు వైన్ షాపుల్లో.. బార్లలో.. పబ్స్ లో అందుబాటులో ఉండవు. 

కింగ్ ఫిషర్ బీర్లు సరఫరాను నిలిపివేస్తున్నట్లు 10 రోజుల క్రితమే ఆ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవటం, ధరలు పెంచాలన్న కంపెనీ నిర్ణయానికి.. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవటంతో.. KF బీర్ల సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో ఉన్న స్టాక్ తోనే ఇప్పుడు నెట్టుకొస్తున్నారు వైన్ షాప్ ఓనర్లు. ఈ స్టాక్ కూడా మరో 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో.. KF బీర్లు మాత్రమే తాగుతాం.. అది లేకపోతే కష్టం అనుకునే మందు ప్రియులు.. ముందుగానే స్టాక్ పెట్టుకోండి.. ఆ తర్వాత వైన్, బార్ల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉంటే మాత్రం మీ తప్పు.. 

కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీతో చర్చలు జరుపుతున్నది. కంపెనీ దిగిరాకపోతే.. కొత్త బ్రాండ్లను రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినా.. KF అలవాటు పడిన ప్రాణాలు మాత్రం వాటి కోసం గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఈ 10 రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. వెయిట్ అండ్ సీ.. కింగ్ ఫిషర్ బ్రాండ్స్..