
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. వైన్స్‌కు బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యూబీఎల్ వివరించారు.
ఈనెల 8న కింగ్‌ఫిషర్‌తో పాటు ఏడు బ్రాండ్ల బీర్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో కొరత ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, యూబీఎల్ మధ్య చర్చలు జరిగాయి. ఇరు పక్షాల మధ్య ఒప్పందం మేరకు సమస్య తీరింది.