సముద్రంపై సర్​ప్రైజింగ్​ అడ్వెంచర్స్​ చూపిస్తూ..కింగ్స్‌‌టన్

సముద్రంపై సర్​ప్రైజింగ్​ అడ్వెంచర్స్​ చూపిస్తూ..కింగ్స్‌‌టన్

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తూ నిర్మించిన తమిళ చిత్రం ‘కింగ్స్‌‌టన్’. కమల్ ప్రకాష్ దర్శకుడు.  గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై  మహేశ్వర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ‘సముద్రం బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఉండే  థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో జాలరి పాత్ర చేశా. తన ఊరిలో ఉన్న శాపం కారణంగా సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లరు.

ఆ శాపాన్ని ఎదిరించి హీరో సముద్రంలోకి వెళ్తాడు.‌‌ అందులో హీరోకు జాంబీలు, ఆత్మలు ఎదురవుతాయి. మొత్తానికి ఈ చిత్రం  ప్రేక్షకులను  సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  ఇందులో అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం ట్రైనింగ్ తీసుకున్నా. కథ బాగా నచ్చడంతో హీరోగా చేస్తూనే జీ స్టూడియోస్‌‌తో కలిసి  ప్రొడ్యూస్ చేశా.   హాలీవుడ్ దర్శక నిర్మాతలు వాళ్ల కథలను చెబుతుంటే..  మేం ఈ చిత్రం  ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకువస్తున్నాం.

దీనికి కొనసాగింపుగా మా దగ్గర నాలుగు పార్టుల వరకు కథ రెడీగా ఉంది. ఇక  హీరోగా 25 సినిమాలు, సంగీత దర్శకుడిగా 100 సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.  యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండింటికి ప్రోపర్ టైం కేటాయిస్తా.  ఒకసారి షెడ్యూల్ మిస్ అయినా ప్లాన్ బి ఉంటుంది’ అని చెప్పాడు.