నల్గొండ అర్బన్, వెలుగు: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీవీయూవీ రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు, జిల్లా అధ్యక్షుడు కిన్నెర శ్రీనివాసు పిలుపునిచ్చారు. మంగళవారం క్లాక్ టరవ్ సెంటర్‌లో నిరసన తెలిపి మాట్లాడారు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే పేపర్ లీకేజీలతో వారి జీవితాలను ఆగం చేసిందని మండిపడ్డారు.
గ్రూప్1 రద్దు, గ్రూప్2 వాయిదా, డీఎస్సీ ఊసే లేకుండా పోయిందని వాపోయారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడుల్లో అల్పాహారం పెట్టి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. నేతలు సైదులు, రాము, సంతోష్, దిలీప్, లింగయ్య, సంధ్య, ప్రసాద్, నరేశ్ పాల్గొన్నారు.