కిన్నెరసానికి పర్యాటక శోభ

పాల్వంచ, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని కిన్నెరసాని పర్యాటక కేంద్రానికి పర్యాటకులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో రద్దీ పెరిగింది. ఈ పర్యాటక కేంద్రానికి మంగళవారం ఒక్కరోజే  రూ.1.06లక్షల ఆదాయం వచ్చింది. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని అధికారులు పేర్కొన్నారు.