కిన్నెరసాని రెండు గేట్లెత్తిన అధికారులు

  • 8వేల క్యూసెక్కుల నీటి విడుదల

పాల్వంచ రూరల్, వెలుగు : తుఫాను కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు చేరుతోంది.  దీంతో 407 అడుగుల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్​ నీటిమట్టం బుధవారం 404.60 అడుగులకు చేరుకుంది.

ఈ కారణంగా కేటీపీఎస్​ డ్యాం సైట్​ అధికారులు రిజర్వాయర్​కు ఉన్న 12 క్లస్ట్​ గేట్లలో రెండు గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. గేట్లు ఎత్తేముందు కిన్నెరసాని పరివాహక ప్రజలను  అప్రమత్తం చేశారు.