భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన ముసురు వదలలేదు. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వాగు దాటుతూ ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. రాయపాడు వద్ద బైక్పై ఇద్దరు వాగు దాటేందుకు ప్రయత్నించగా ఘటన చోటు చేసుకుంది. చాలా మంది రోప్ సాయంతో వరద నీటిలో ప్రయాణం చేస్తున్నారు. అలానే టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన దొడ్డసాయి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గల్లంతైన మరో వ్యక్తి కోరం వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ టీంమ్స్ గాలిస్తున్నాయి. గుండాల మండలం దామరతోగులో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా ఘటన జరిగింది.