KCPD Lyrical: కిరణ్‌ అబ్బవరం కాలేజ్ మాస్.. ఇచ్చి పడేసేలా దిల్‌‌రూబా స్టూడెంట్ అంతేమ్..

KCPD Lyrical: కిరణ్‌ అబ్బవరం కాలేజ్ మాస్.. ఇచ్చి పడేసేలా దిల్‌‌రూబా స్టూడెంట్ అంతేమ్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో హిట్ కొట్టి తన సత్తా చూపించాడు. ఇపుడు 'దిల్ రూబా' అంటూ కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ మార్చి 14న థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో మేకర్స్ వరుస అప్డేట్స్తో ఆడియన్స్లో జోష్ పెంచుతున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ (మార్చి 11న) దిల్ రూబా నుంచి నాలుగో పాట రిలీజ్ చేశారు. ‘ఇట్స్‌ టైమ్‌ ఫర్‌ KCPD..’(KCPD Lyrical) అంటూ ఇంగ్లీష్ లిరిక్స్‌తో కూడిన స్టూడెంట్ అంతేమ్ ఒకటి  తీసుకొచ్చారు. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటకు డైరెక్టర్ విశ్వ కరుణ్ లిరిక్స్ అందించారు. అభిషేక్ AR పాడారు. శృతి , డెరిక్ , సతీష్ కోరస్ ఇచ్చారు. 

ALSO READ | Theater Release: ఈ శుక్రవారం (మార్చి 14న).. థియేటర్లలలో చిన్న సినిమాలేదే హవా.. అవేంటో లుక్కేయండి

ఇకపోతే, విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కిరణ్కి జోడీగా రుక్సర్ థిల్లాన్ నటించింది. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించారు. యాక్షన్, లవ్ రొమాంటిక్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ ఇంటెన్స్‌‌ లవ్‌‌ స్టోరీతో రానుంది.

  • Beta
Beta feature