తెలుగులో యంగ్ హీరో కిరణ్ సబ్బవరం హీరోగా నటించిన క సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం కి జోడీగా నయన్ సారిక, తన్వి రామ్ నటించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. దీంతో రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.12 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
క సినిమా మంచి హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తమిళనాడులో ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం క సినిమా ని చెన్నై లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నించామని కానీ కనీసం ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదని తెలిపాడు.
Also Read : మృణాల్ ఠాకూర్ ఫొటో ఎడిట్.. ?
అలాగే అమరన్ సినిమా తెలుగులో ఆడియన్స్ మంచి హిట్ చేశారని కానీ తమిళ్ లో తెలుగు సినిమా కోసం కనీసం ఒక్క థియేటర్ కూడా ఇవ్వకపోవడం భాదకరమని అన్నారు. దీంతో తెలుగు సినిమా ఫ్యాన్స్ క సినిమాని తమిళనాడులో రిలీజ్ చెయ్యాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారని థియేటర్లు ఇవ్వకపోవడంతో కుదరడం లేదని తెలిపారు.
ఇక క సీక్వెల్ గురించి త్వరలోనే క పార్ట్ 2 గురించి అనౌన్స్ చేస్తామని అన్నారు. అలాగే "క పార్ట్ 2" కోసం డైరెక్టర్లు సుజిత్, సందీప్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు.