Kiran Abbavaram: తండ్రి కాబోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం.. గుడ్ న్యూస్ చెబుతూ ఫొటో షేర్‌

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం.. గుడ్ న్యూస్ చెబుతూ ఫొటో షేర్‌

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో తండ్రి కాబోతున్నారు. తాను తండ్రిని కాబోతున్నట్లు తెలుపుతూ మంగళవారం (జనవరి 21న) ఉదయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కిరణ్ తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ (Rahasya Gorak)తో ఆగస్ట్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

తాజాగా తన భార్య రహస్య బేబీ బంప్తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ  " మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కిరణ్ అబ్బవరం కోరుకున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇటీవలే కిరణ్ 'క' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తన భార్య రహస్య సైతం నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంది.

రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే కిరణ్ - రహస్యల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్య ప్రేమాయ‌ణం సాగించిన ఈ జంట 2024 ఆగస్ట్ లో పెళ్లితో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు.

ఇదిలా ఉంటే..రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు. చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం స్థాపించిన క ప్రొడక్షన్స్ బాధ్యతలను నిర్వహిస్తుంది. త్వరలో కిరణ్ తన కొత్త సినిమా 'దిల్ రుబా' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.