స్టోరీ ఏంటో గెస్ చెయ్. ఫ్రీగా బైక్ కొట్టేయ్: హీరో కిరణ్ అబ్బవరం.

స్టోరీ ఏంటో గెస్ చెయ్. ఫ్రీగా బైక్ కొట్టేయ్:  హీరో కిరణ్ అబ్బవరం.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది చివరిలో వచ్చిన "క" సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది దిల్ రూబా సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కిరణ్ కి జంటగా యంగ్ హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ నటిస్తుండగా నూతన డైరెక్టర్ విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. 

లవ్ అండ్ ఎమోషనల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం డిఫరెంట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. బైక్ గివ్ అవే అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు.

అయితే ఈ వీడియోలో దిల్ రూబా అనేది తనకి సంబందించిన లవ్ అండ్ యాంగర్ ఎమోషన్ అని.. తన బైక్ తన లవ్ అని తెలిపాడు. ఆలాగే ఈ వీడియోలో కనిపించిన బైక్ ని తన ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేయించాడని చెప్పుకొచ్చాడు. అయితే దిల్ రూబా సినిమా స్టోరీ ఏంటో కరెక్ట్ గా గెస్ చేసిన వారికి ఈ కస్టమైజ్డ్ బైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్రీగా ఇచ్చేస్తాని తెలిపాడు. అంతేకాదు దిల్ రూబా సినిమా రిలీజ్ రోజున ఇదే బైక్ మీద ఫస్ట్ షోకి తనతో కలసి వెళ్లి సినిమా చూడచ్చని చెప్పుకొచ్చాడు. 

ALSO READ | Akhanda 2 : అఖండ-2 కోసం హిమాలయాల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను

దీంతో నెటిజన్లు ఈ పోస్ట్ కి స్టోరీలు గెస్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కాంటెస్ట్ లో అమ్మాయిలు కూడా పాల్గొనవచ్చు. ఒకవేళ అమ్మాయిలు స్టోరీ కరెక్ట్ గా గెస్ చేస్తే ఈ బైక్ ని తమ బాయ్ ఫ్రెండ్ లేదా ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చని  హీరో కిరణ్ అబ్బవరం తెలిపాడు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దిల్ రూబా స్టోరీ ఏంటో గెస్ చేసి ఫ్రీ గా బైక్ కొట్టెయ్యండి.