కిరణ్ అబ్బవరం దిల్ రుబా మూవీ షూట్ కంప్లీట్

కిరణ్ అబ్బవరం దిల్ రుబా మూవీ షూట్ కంప్లీట్

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘దిల్ రుబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో  రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ కలిసి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్  హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. బ్యూటిఫుల్ లొకేషన్స్‌‌‌‌లో  హై క్వాలిటీతో దీన్ని రూపొందించినట్టు తెలియజేశారు. త్వరలోనే  ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేస్తామని అన్నారు. ఇటీవల అనౌన్స్ చేసిన  టైటిల్‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 

లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. ‘క’ లాంటి  సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.