Dilruba Review: దిల్ రుబా రివ్యూ.. కిరణ్ అబ్బవరం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?

Dilruba Review: దిల్ రుబా రివ్యూ.. కిరణ్ అబ్బవరం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ దిల్ రుబా (Dilruba). రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు 'హోలీ'  సందర్భంగా (మార్చి 14న) సినిమా రిలీజయింది. గత చిత్రం 'క' తో బాక్సాఫీస్ సూపర్ హిట్ అందుకున్న కిరణ్ ' దిల్ రుబా' తో ఎలాంటి హిట్ అందుకున్నాడో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దు (కిరణ్ అబ్బవరం) ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్. సారీ, థ్యాంక్స్‌ అనే పదాలను సిద్ధు గౌరవిస్తాడు. కానీ, అవి ఎక్కడపడితే అక్కడ వాడకూడదనే నిర్ణయంతో ఉంటాడు. అలా తన జీవితంలో ఒక అమ్మాయి కారణం వల్ల చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. సిద్దు జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒకరు మ్యాగీ (ఖ్యాతి డేవిసన్). వీరిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోతారు. దీంతో అమ్మాయిలు అంటేనే అసహ్యం పెంచుకుంటాడు సిద్దు.

అయితే, తన లవర్ బ్రేకప్‌ చెప్పిన బాధ సిద్ధుని వెంటాడుతుంది. ఇక తన బాధను చూడలేక సిద్దు తల్లి, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో జాయిన్‌ అవుతాడు. అక్కడ తన క్లాస్‌మేట్‌ అంజలి (రుక్సార్‌ థిల్లాన్‌)తో ప్రేమలో పడతాడు. ఇక పూర్తిగా సిద్దార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలికి దగ్గరవుతాడు. అలాగే, ఆ కాలేజీకి చెందిన విక్కీ(కిల్లి క్రాంతి)తో సిద్దార్థ్‌కి గొడవలు జరుగుతాయి.

ఈ క్రమంలోనే అంజలి కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది.  విలన్ విక్కీ ద్వారా తన ప్రేమకు వచ్చిన సమస్యలు ఏంటి? ఇంతలో, అతని మాజీ ప్రేయసి మ్యాగీ ఇండియాకి ఎందుకు తిరిగొస్తోంది? డ్రగ్స్‌ మాఫియా డాన్‌ జోకర్‌(జాన్‌ విజయ్‌) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు?  మ్యాగీ మళ్ళీ సిద్ధు లైఫ్ లోకి ఎందుకు రావాలనుకుంటుంది? అసలు సిద్ధు తన లైఫ్ లో సారీ, థ్యాంక్స్‌ అనే పదాలను ఎందుకు చెప్పడు? అనే విషయాలు తెలియాలంటే దిల్ రుబా థియేటర్లో చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

కిరణ్ అబ్బవరం ఈ సారి ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నాడు.అయితే, ఈ సినిమా 'క' కంటె ముందుగా ఎంచుకున్న కథ. అందుకే అనుకున్నంత కొత్త పాయింట్స్ ఏం ఉండవు. కానీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే, హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్‌ చెప్పకపోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

అలాగే, హీరో కష్టాల్లో ఉంటే తన మాజీ లవర్ రంగంలోకి దిగి అండగా ఉండడం. హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. కానీ, అది తెరపై మలిచిన తీరు ఇంకాస్తా బలంగా ఉంటే సినిమాకు మరింత స్పెషల్ అయ్యేది. రుక్సార్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, విజువల్స్ ఆసక్తిగా సాగాయి. ఒక అబ్బాయి చుట్టూ రెండు ప్రేమ కథలు ఉన్నాయంటే, అందులో ఓ సంఘర్షణ ఉండాలి. కానీ, ఈ సినిమాలో అది లేదనే ఫీలింగ్ ఇస్తోంది.

మిగతా సినిమాల్లో మాదిరి కాకుండా, పూర్తి భిన్నంగా సీన్స్ రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఎక్స్ లవర్ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి అతని ప్రెజెంట్ లవ్‌ను కలిపే ప్రయత్నం చేయడం అనేది దిల్‌రూబాలో కొత్తగా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే:

కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ఫైట్స్ విషయంలో ఇంటెన్స్ గా నటించాడు. కిరణ్ డైలాగ్ డెలివరీ, క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా చేశాడు. రుక్సార్‌ థిల్లాన్‌ పాత్ర ఆకట్టుకుంటోంది. రుక్సర్ తన యాక్టింగ్‌తో గుర్తుండిపోతుంది. సత్య కామెడీ సినిమాకు ప్రధాన బలంగా ఉంది. హీరో తండ్రి పాత్ర ఎమోషన్ ఫీల్ ఇస్తోంది. విలన్‌గా కనిపించిన విక్కీ, జోకర్ అంతగా ఆకట్టుకోలేదని అనిపిస్తోంది.