
హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ దిల్రూబా (Dilruba).రుక్సర్ థిల్లాన్, కాథీ డేవిసన్ హీరోయిన్లుగా నటించారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 'హోలీ' సందర్భంగా (మార్చి 14న) విడుదలైంది. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన దిల్రూబా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు.
ఈ క్రమంలో దిల్రూబా ఓటీటీలో అడుగుపెట్టనుంది. అయితే, ఈ మూవీ రెండు తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రానున్నట్లు సమాచారం. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్తో పాటుగా ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 25 నుంచి దిల్రూబా స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఓటీటీ రిలీజ్ డేట్పై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
గతేడాది 'క' మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన దిల్రూబాతో మాత్రం డిజాస్టర్గా నిలిచింది.
Also Read : కుప్పన్ మూవీలో కేథరిన్ థ్రెస్సా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్
కథేంటంటే:
సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దు (కిరణ్ అబ్బవరం) ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు గౌరవిస్తాడు. కానీ, అవి ఎక్కడపడితే అక్కడ వాడకూడదనే నిర్ణయంతో ఉంటాడు. సిద్దు జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒకరు మ్యాగీ (ఖ్యాతి డేవిసన్). వీరిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోతారు. దీంతో అమ్మాయిలు అంటేనే అసహ్యం పెంచుకుంటాడు సిద్దు.
అయితే, తన లవర్ బ్రేకప్ చెప్పిన బాధ సిద్ధుని వెంటాడుతుంది. ఇక తన బాధను చూడలేక సిద్దు తల్లి, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్‌మేట్ అంజలి (రుక్సార్ థిల్లాన్)తో ప్రేమలో పడతాడు. ఇక పూర్తిగా సిద్దార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలికి దగ్గరవుతాడు. అలాగే, ఆ కాలేజీకి చెందిన విక్కీ (కిల్లి క్రాంతి)తో సిద్దార్థ్‌కి గొడవలు జరుగుతాయి.
ఈ క్రమంలోనే అంజలి కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. విలన్ విక్కీ ద్వారా తన ప్రేమకు వచ్చిన సమస్యలు ఏంటి? ఇంతలో, అతని మాజీ ప్రేయసి మ్యాగీ ఇండియాకి ఎందుకు తిరిగొస్తోంది? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? మ్యాగీ మళ్ళీ సిద్ధు లైఫ్ లోకి ఎందుకు రావాలనుకుంటుంది? అసలు సిద్ధు తన లైఫ్ లో సారీ, థ్యాంక్స్ అనే పదాలను ఎందుకు చెప్పడు? అలా తన జీవితంలో ఒక అమ్మాయి కారణం వల్ల అవి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? అనే విషయాలు తెలియాలంటే దిల్ రుబా చూడాల్సిందే.