KA Movie: ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ, నాకు? హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

KA Movie: ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ, నాకు? హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన క (KA) మూవీ గురువారం (అక్టోబర్ 31న) థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు ట్విస్టులు అదిరిపోయాయని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు.

అంతేకాకుండా.. క మూవీ కాన్సెప్ట్ బాగుందని.. డైరెక్టర్లు సుజిత్, సందీప్ మంచి కథతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు డైరెక్టర్స్ క్లైమాక్స్‌ తీసిన విధానం మైండ్ పోతుందని థియేటర్ ఆడియన్స్ తమ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో హీరో కిరణ్ అబ్బవరం ఉన్నారు. ఈ మేరకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో క మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

Also Read :- నవ్వుల పండుగని తెస్తున్నారు.. ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "క సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని మాకిచ్చిన ప్రేక్షకులక దేవుళ్ళకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూడటానికి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో క మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ తో.. సినిమా చూసిన తమ సొంత ఫీలింగ్స్ తో.. షేర్ చేసుకోవడం చూస్తుంటే అంతటా గెలిచేసాం. క సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్‌గా చేశారు" అని కిరణ్ చెప్పుకొచ్చాడు. 

అలాగే.. ట్విట్టర్ ద్వారా కిరణ్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. "ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ, నాకు హిట్ వస్తే 'హిట్ కొట్టేశాం' అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ కంటే మీరూ నా పైనా చూపిస్తున్న అభిమానం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.  ఇంతటి  ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతతో ధన్యవాదాలు" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు కిరణ్ అబ్బవరం.

  • Beta
Beta feature