KA Trailer: అంచనాలు పెంచేలా 'క' ట్రైలర్.. మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు..కిరణ్కి హిట్ పక్కా అనేలా!

KA Trailer: అంచనాలు పెంచేలా 'క' ట్రైలర్.. మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు..కిరణ్కి హిట్ పక్కా అనేలా!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ టీజర్, వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న 'క' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రాబోతోంది.

ఈ సందర్బంగా నేడు (అక్టోబర్ 25న) 'క' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. టైమ్ ట్రావెల్ లాంటి వస్తువును చూపించి కృష్ణగిరి అనే మారుమూల అటవీ ప్రాంతం నుండి వచ్చినట్టు హీరో (అభినయ వాసుదేవ్)ని చూపించారు.ఈ పల్లెటూర్లో పోస్ట్ మ్యాన్గా పని చేస్తూ ఆ ఊరి ప్రజలకు వచ్చే ఉత్తరాలను చదువుతు తిరిగే కుర్రాడిగా చూపిస్తూనే.. ఆ తర్వాత అతనిలోని ఇంటెన్స్ను పరిచయం చేశారు. 

ఇక ఆ ఊరి ప్రజలకు వచ్చే ఉత్తరాలను చదువుతు తిరిగే కుర్రాడిగా చూపిస్తూనే.. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడడం ఆసక్తికరంగా చూపించారు. ఇలా ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమని ఓ  ముసుగు వ్యక్తి మరియు అతని గ్యాంగ్ వాసుదేవ్ను బెదిరించడం.. దాంతో ఆ ఉత్తరంలో ఏముందనే ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. అంతేకాకుండా కిరణ్‌ అబ్బవరం నటన, డైలాగ్స్, యాక్షన్‌ సీన్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్, కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీతోనే వీరిద్ద‌రు డైరెక్ట‌ర్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.

  • Beta
Beta feature