ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం.. ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతుల్య రవి హీరోయిన్. రమేష్ కాదూరి దర్శకత్వంలో చెర్రీ, హేమలత నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు బాబీ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ‘రమేష్ నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. అందుకే ఈ సినిమా బాధ్యత నాపై కూడా ఉంటుంది. కిరణ్‌కి ఈ మూవీ కొత్త మీటర్ సెట్ చేస్తుందని నమ్ముతున్నా. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ మూవీ అని అర్ధమవుతుంది’ అని చెప్పాడు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ ఎలాంటి సినిమాలైతే చూసి విజిల్స్ వేశానో.. అలాంటి సినిమానే ‘మీటర్’. హై లెవల్ ఎనర్జీ ఉండే సబ్జెక్ట్ ఇది. థియేటర్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారి సినిమాలు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి తరహాలో ఉంటుంది’ అని అన్నాడు. ‘మా సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు దర్శకుడు రమేష్. చెర్రీ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది. చాలా డైనమిక్‌గా ఉండబోతుంది. కిరణ్‌లోని మాస్ అవతార్‌ను చూస్తారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మాకు అండగా నిలిచింది’ అన్నారు. సప్తగిరి, సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
పక్కా మాస్ మీటర్
- టాకీస్
- March 8, 2023
మరిన్ని వార్తలు
-
సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
-
OTT Movies: ఓటీటీలోకి (జనవరి 20-26) వరకు 15కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
-
మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
-
Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
లేటెస్ట్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11లో అతడు ఉండాల్సిందే: అశ్విన్
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచండి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలు మళ్ళీ వస్తున్నాయి.. జాబ్ నోటిఫికేషన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం...
- స్పెషల్ CS రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం.. లోన్లు, డిజైన్లు, బడ్జెట్ చూట్టే క్వశ్చన్స్..!
- దోషికి ఉరి శిక్ష వేయండి: వైద్యురాలి హత్యాచార ఘటనపై హైకోర్టుకు బెంగాల్ సర్కార్
- V6 DIGITAL 21.01.2025 EVENING EDITION
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- పిల్లల కోసం ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా..? ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..!
Most Read News
- రేషన్‌కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- యూజర్లకు షాకిచ్చిన జియో.. రూ.199 ప్లాన్‌పై వంద రూపాయలు పెంపు
- జూబ్లీహిల్స్‌లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
- గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనం.. బెంబేలెత్తుతున్న రైతులు