కిరణ్ అబ్బవరం కొత్త సినిమా దిల్ రుబా

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా  దిల్ రుబా

రీసెంట్‌‌గా విడుదలైన ‘క’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. తను నటిస్తున్న కొత్త చిత్రానికి ‘దిల్ రుబా’ అనే టైటిల్‌‌ను గురువారం ప్రకటించారు. రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వంలో  రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ కలిసి నిర్మిస్తున్నారు.

టైటిల్ అనౌన్స్‌‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఇంటరెస్ట్‌‌  క్రియేట్ చేస్తోంది.  యూనిక్ స్టైల్, యాటిట్యూడ్‌‌తో కిరణ్ అబ్బవరం  కనిపిస్తున్నాడు. ‘హిస్ లవ్, హిస్ యాంగర్..’ అనే కొటేషన్‌‌తో తన  క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేశారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌‌‌గా దీన్ని రూపొందించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.  సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.