
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన నుండి చివరగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కిరణ్. ఆ సమయాన్ని తన తరువాతి సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకోవడనికి ఉపయోగించుకున్నాడు.అదేంటంటే..కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడట.
తాజాగా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజయింది.ఈ మూవీకి “క” KA అనే విభిన్నమైన టైటిల్ ను ప్రకటించాడు హీరో అబ్బవరం. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్,కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్,సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్.ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో కిరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.
KA- క pic.twitter.com/mFOhgGCWd6
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 10, 2024