
‘క’ లాంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించారు. ఈనెల 14న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి కిరణ్ అబ్బవరం ఇలా వివరించాడు.
- ‘మనం సారీ, థ్యాంక్స్ లాంటి పదాలను తరచుగా వాడుతుంటాం. కానీ ఇందులోని సిద్ధు పాత్రకు అది నచ్చదు. చిన్న చిన్న విషయాలకు వాటిని వాడకూడదు, వాటికంటూ ఓ విలువ ఉందనేది అతని వెర్షన్. అలాగే ఎక్స్ లవర్.. తన మాజీ ప్రియుడి ప్రేమకథకు హెల్ప్ చేయడం కొత్తగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా స్నేహంగా ఉంటూ మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్ చూపించాం. ప్రేమలోని మ్యాజిక్ మూమెంట్స్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు.
- హీరో క్యారెక్టరైజేషన్, అతని మాటలు ఆలోచింపజేస్తాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్‌ను ఇబ్బంది పెట్టే ఒక డైలాగ్, ఒక్క సీన్ కూడా ఇందులో ఉండదు. సిద్ధు పాత్రలో కొత్తగా కనిపిస్తా. అది అందరికీ నచ్చుతుంది. ఇది సింగిల్ లైన్ సినిమా కాదు.. అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఫుల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీలా ఆకట్టుకుంటుంది. మంచి సినిమా చూశామనే ఫీల్‌తో బయటకు వస్తారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం
- పోస్టర్‌పై నన్ను చూసి ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు కనుక మేకింగ్ విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యత కూడా. వచ్చే ఏడాది నా నుంచి కనీసం మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నా. ఇక ఇతర భాషల సినిమాలు ఏ కొంచెం బాగున్నా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కానీ మన సినిమాలకు తమిళ, మలయాళ భాషల్లో అంత ఆదరణ ఉండటం లేదు. ‘క’ సినిమా విషయంలో ప్రత్యక్షంగా అది చూశాను.
- ‘క’ తర్వాత మన ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమాలు చేస్తున్నాననే పాజిటివ్ ఒపీనియన్ మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా. గతంలో మొహమాటానికి కొన్ని సినిమాల్లో నటించాను. ఆ తప్పులకు రిగ్రెట్ ఫీలవడం లేదు. ఇకపై మంచి కథలను ఎంచుకుంటూ ఈ జర్నీ కొనసాగిస్తాను. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నా. నాలుగు వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ అయితే మరొకటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. మరో చిత్రం లంకె బిందెల నేపథ్యంలో ఉంటుంది