రొమాంటిక్ యాక్షన్ దిల్ రూబా టీజర్

రొమాంటిక్ యాక్షన్  దిల్ రూబా టీజర్

కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా విశ్వ కరుణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిల్‌‌రూబా’. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ ‘ఇందులో నేను పోషించిన సిద్ధు పాత్ర చాలా స్పెషల్‌‌గా హార్డ్ హిట్టింగ్‌‌గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనైనా వెనకడుగు వేయడు. నమ్మిన దానికే జీవితాంతం కట్టుబడి ఉంటాడు. తను నమ్మే సిద్ధాంతం చాలా కొత్తగా ఉంటుంది. అది అందరికీ నచ్చుతుంది.

ఇంటెన్స్‌‌ లవ్‌‌ స్టోరీతో పాటు ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో ఆకట్టుకుంటుంది. ‘క’ చిత్రం తర్వాత ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అంచనాలను తప్పకుండా ఈ సినిమా అందుకుంటుంది’ అని చెప్పాడు.  ‘మనందరి జీవితాల్లోని ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశా. మీరంతా ఈ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తారు’ అని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పాడు.  నిర్మాత రవి మాట్లాడుతూ ‘మునుపెన్నడూ చూడని ఓ ఇంటెన్స్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో కిరణ్‌‌ను చూస్తారు.

డైరెక్టర్ విశ్వ కరుణ్‌‌తో సహా టీమ్ అంతా చాలా ప్యాషనేట్‌‌గా పనిచేశారు’ అని చెప్పారు.  ‘అల్లు అర్జున్‌‌ కెరీర్‌‌‌‌లో ‘ఆర్య’ సినిమాలా కిరణ్‌‌కు ‘దిల్ రూబా’ నిలుస్తుంది’ అని కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి చెప్పారు.  ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్,  డీవోపీ డానియేల్ విశ్వాస్,  కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్, జిత్తు పాల్గొన్నారు.