
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba). రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. మార్చి 14న సినిమా విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మాజీ ప్రేమికులు అనగానే శత్రువులుగా ఫీలవుతుంటాం. కానీ మాజీ లవర్‌పై ప్రేమ తగ్గొచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలాగే ఉంటుందనే క్యూట్ మెసేజ్ ఇందులో ఉంది.
వీలైతే మీ లవర్‌తో, కుదిరితే మీ మాజీ లవర్‌తో ఈ సినిమాకు వెళ్లండి. థియేటర్ నుంచి ముగ్గురూ ఫ్రెండ్స్‌గా బయటకు వస్తారు. అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పాడు. ప్రేమికులందరూ ఈ చిత్రానికి తప్పకుండా కనెక్ట్ అవుతారని హీరోయిన్ రుక్సర్ చెప్పింది. మాజీ లవర్‌గా తను పోషించిన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని మరో హీరోయిన్ కతి డేవిసన్ చెప్పింది.
ALSO READ | Sharwanand: శర్వానంద్ డబుల్ ట్రీట్.. కొత్త సినిమాల అప్డేట్స్ కమింగ్
‘ట్రైలర్ చివర్లో చెప్పినట్టు ‘ప్రేమ గొప్ప కాదు.. అది ఇచ్చే మనిషి గొప్ప’ అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్’ అని దర్శకుడు తెలిపాడు. ‘హీరో కిరణ్ కెరీర్‌లో ఘనవిజయం సాధించి, మెమొరబుల్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత రవి తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీవోపీ విశ్వ డానియల్, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.