టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న 'క' సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను..తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్(Wayfarer Films) భారీ ధరకు సొంతం చేసుకుంది.
"క" సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్‌ను తమ వేఫేరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. మలయాళ మార్కెట్ లో KA సినిమాకి దుల్కర్ ఎంట్రీతో బలమైన పునాది అందిస్తుంది. "క" సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా భాషల థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలో హీరో కిరణ్ స్పందిస్తూ.."మీ సానుకూల స్పందనతో "KA" రోజురోజుకు మరింత పెద్ద మూవీగా మారుతుంది. అతి త్వరలో థియేటర్లలో అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ధన్యవాదాలు దుల్కర్ సర్.."KA"ని మన మలయాళ ప్రేక్షకులకు తీసుకెళ్లినందుకు" అని తెలిపారు.
With all your positive response “KA” is getting bigger and better day by day. Promising you with the best experience in theatres very soon. Thank you @DQsWayfarerFilm for taking “KA” to our Malayalam audience.#KA #Srichakraasentertainments pic.twitter.com/X2tBEyaElB
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 9, 2024
నిర్మాత వంశి నందిపాటి ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను మంచి ధరకు సొంతం చేసుకోవడంతో..మిగతా భాషల మేకర్స్ కూడా ముందుకొస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ లాంటి హీరో ఎం,మలయాళ హక్కులు దక్కించుకోవడంతో సినిమా ఫ్యాన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.సినిమాలో మంచి కంటెంట్ లేకపోతే దుల్కార్ సల్మాన్ వంటి స్టార్ హీరో మలయాళ థియేట్రికల్ రైట్స్ కొనరు కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
. @connect2vamsi Gaaru ❤️#KAasKA #KA pic.twitter.com/UvwD4cKW60
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 25, 2024
శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్,కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్,సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్.శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో కిరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.