‘భీమ్లానాయక్’ కారణంగా మరో వాయిదా

పోయినేడు ‘ఎస్‌‌ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ అబ్బవరం.. ఈ యేడు ముందుగా ‘సెబాస్టియన్‌‌ పీసీ 524’ సినిమాతో రానున్నాడు. కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సయ్యపురెడ్డి బాలాజీ దర్శకుడు. సిద్ధారెడ్డి, జయచంద్రారెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం ‘భీమ్లానాయక్’ కారణంగా వాయిదా పడింది. మార్చ్ 4న విడుదల కానుంది. ప్రమోషన్స్​లో భాగంగా నిన్న ఓ పాటను రిలీజ్ చేశారు. ‘కంటిలోన చీకటిని గుండెలోన దాచుకుని వేదనలో వేడుకలా వెలుగు సెబా.. రాజాధిరాజా’ అంటూ సాగే ఈ పాటను జిబ్రాన్ ట్యూన్ చేశాడు. భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాశాడు. పద్మలత పాడింది. రేచీకటి ఉన్న పోలీసు పాత్రలో కిరణ్ కనిపించనున్నాడు. తన సమస్యని మెన్షన్ చేస్తూ, క్యారెక్టర్‌‌‌‌ని ఎలివేట్‌‌ చేస్తూ ఈ పాటను రూపొందించారు. మరోవైపు సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు కిరణ్.