ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిస్సోరి స్టేట్ లో ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. శ్యాండిల్ ఎస్ టౌన్ లో ఈత కొట్టేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి దిగిన కిరణ్..ఈత రాకపోవడంతో నీటమునిగి మృతి చెందాడు. గతేడాది నవంబర్ లో అమెరికా వెళ్లిన కిరణ్..శ్యాండిల్ టౌన్ లో MSచదువుతున్నాడు.
కిరణ్ తండ్రి గతంలోనే చనిపోగా.. తల్లి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. వీరి బాధ్యతలను తాత కృష్ణమూర్తి రాజు చూస్తున్నారు. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిన కిరణ్ చనిపోవడంతో చిన్నకొరుకొండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాం గురువారం నాటికి స్వగ్రామానికి వస్తుందని కుటుంబ సభ్యుల తెలిపారు.