ఆ విషయాన్ని గ్రహించండి చిరంజీవి జీ అంటూ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంచలనం..

ఆ విషయాన్ని గ్రహించండి చిరంజీవి జీ అంటూ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంచలనం..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిపై మాజీ  మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ సంచలన వాఖ్యలు చేశారు. ఆమధ్య చిరు ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో తన ఇల్లంతా ఆడపిల్లలతో నిండి ఉండటంతో లేడీస్ హాస్టల్ మాదిరిగా తయారైందని దీంతో ఈసారి చరణ్ ని వారాసుడిని కనమని చెప్తానని కామెంట్లు చేశాడు. దీంతో ఈ వాఖ్యలపై నేషనల్ మీడియాలో కూడా చర్చలు జరిగాయి. 

ALSO READ | నీ బూత్ జోకులు ఏమన్నా ప్రతిభ అనుకుంటున్నావా.. యూట్యూబర్ రణవీర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం

అయితే తాజాగా కిరణ్ బేడీ సోషల్ మీడియాలో చిరు వాఖ్యలపై స్పందించింది.. ఇందులో భాగంగా "చిరంజీవి జీ, దయచేసి కూతురు కూడా ఒక వారసత్వమేనని నమ్మడం మరియు గ్రహించడం ప్రారంభించండి. అదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు మరియు ఆమె ఎలా అభివృద్ధి చెందుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. తమ కూతుళ్లను పెంచి, వారిని బాగా చూసుకుని, వారి కుటుంబాలను గర్వపడేలా చేసిన తల్లిదండ్రుల నుండి నేర్చుకోండి." అని పేర్కొంది. అంతేకాదు చిరంజీవి ఫోటోని కూడా షేర్ చేసింది. అయితే ఈ సంఘటన జరిగి నెల రోజులయ్యింది. ఆ తర్వాత మళ్లీ చిరు ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కిరణ్ బేడీ ఈ అంశంపై స్పందించడంతో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా చిరంజీవి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని యాక్షన్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ హీరో నాని సమర్పణలో ఎస్ఎల్వి సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక ఇప్పటికే చిరు హీరోగా నటించిన విశ్వంభర సినిమా కూడా చివరి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లేదా జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.