మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం ఎమ్మార్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో 512 వంట ఏజెన్సీల్లో 1,527 మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు.
బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులు చేసి భోజనం పెట్టాల్సి వస్తోందన్నారు. పది నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు లక్షి, వెంకటమ్మ, జ్యోతి, రాజమ్మ, జయమ్మ, పర్విన్బేగం, రాజమ్మ పాల్గొన్నారు.