కోహ్లీ, రోహిత్ లకు ఆ రూల్ వర్తించాలి..బీసీసీఐని ప్రశ్నించిన భారత మాజీ క్రికెటర్

కోహ్లీ, రోహిత్ లకు ఆ రూల్ వర్తించాలి..బీసీసీఐని ప్రశ్నించిన భారత మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. 2024–25 కోసం బుధవారం ప్రకటించిన సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ ఇద్దర్ని తొలగించింది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేనప్పుడు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఈ ఇద్దరు పట్టించుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంది. అయితే ఏదైనా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసే క్రమంలో ఈ ఇద్దర్ని పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. 

అయ్యర్, కిషాన్ గతేడాది టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించినా.. వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నాడు.

భారత క్రికెటర్లందరూ  రంజీ క్రికెట్ మ్యాచ్ లు ఆడాల్సిందే. ఈ రూల్ అందరికీ వర్తించేలా బీసీసీఐ అమలు చేయాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాలి. వారిని ఆడించకుండా ఇషాన్, శ్రేయస్ విషయంలో ఎందుకు కఠిన చర్యలు తీసుకున్నారని ఈ మాజీ క్రికెటర్ అన్నారు. యువ క్రికెటర్లందరూ ఐపీఎల్ మీద దృష్టి పెడుతున్నారని.. కానీ టెస్ట్ క్రికెట్ ద్వారా గొప్ప ప్లేయర్లు తయారవుతారని..ఆయన అన్నారు. 

కోహ్లీ, రోహిత్ రంజీ మ్యాచ్ లు ఆడేలా బీసీసీఐ చేయాలని.. సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, మెుహిందర్ అమర్ నాథ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు దేశవాళీ మ్యాచ్ లు ఆడేవారని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ లు లేనప్పుడు కౌంటీల్లోకి దిగుతారని.. భారత క్రికెటర్లు ఏమైందని కీర్తి ఆజాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.