
కమర్షియల్ హీరోయిన్‌గా ఎంత డిమాండ్ ఉన్నా.. నటిగా తన స్థాయిని పెంచే పాత్రలపై ఓ కన్నేసి ఉంచుతోంది కీర్తి సురేష్. అందుకే చెల్లెలి పాత్ర చేయడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఆల్రెడీ ‘అన్నాత్తే’లో రజినీకాంత్‌కి చెల్లెలిగా కనిపించింది. ప్రస్తుతం ‘భోళాశంకర్’లో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్ ఇది. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. సిస్టర్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో కీర్తిని తీసుకున్నారు. ఇందులో ఆమెకి ఓ హీరో కూడా ఉంటాడట. ఆ క్యారెక్టర్‌కి నాగశౌర్యని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ‘గుడ్‌లక్ సఖి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కీర్తి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ మూవీని డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అనౌన్స్ చేశారు. అయితే ఈసారి కూడా రిలీజ్ కావట్లేదని టాక్. ఇప్పటికే థియేటర్ల కోసం పెద్ద సినిమాలన్నీ పోటీ పడుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ చిత్రాన్ని తీసుకురావడం మంచిది కాదని దర్శక నిర్మాతలు అనుకుంటు న్నారట. త్వరలోనే ఈ రెండు విషయాలపై ప్రకటన రానుంది.