- 31 వేల కోట్ల లోన్లు మాఫీ చేసినం
- మాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలే
- ధర్నా చేసే నైతిక హక్కు బీజేపీకి లేదు
- కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, రుణమాఫీ కేటీఆర్ కు, హరీశ్ రావుకు ఇష్టం లేదా..? అనేది తేల్చాలని కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ప్రశ్నించారు. మూడు విడుతల్లో 31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేశామని, ఒక్కో రైతుకు రూ. రెండు లక్షల రుణం వరకు మాఫీ అయిందన్నారు.
ఫీలో పొరపాట్లు సర్దే ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమేనని చెప్పారు.2018 లో రూ.20వేల 480 కోట్లు రు ణమాఫీ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. కేవలం 13వేల 3వందల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ రుణమాఫీ ప్రక్రియను ఆలస్యం చేయ డం తో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోతే జిల్లాల్లో నోడల్ ఆఫీసర్ కు దరఖాస్తు పెట్టు కోవాలని కోదండరెడ్డి సూచించారు. కేంద్రంలో బీజేపీ సర్కారు తెచ్చిన నల్ల చట్టాలు కారణంగా 700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. బీజేపీ నేతలు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేసే నైతిక హక్కు లేదని కోదండరెడ్డి పేర్కొన్నారు.